NTV Telugu Site icon

4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం..

ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కేబినెట్ స‌మావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో క‌రోనా కేసులు, వ్యాక్సినేష‌న్‌, థ‌ర్డ్ వేవ్‌, త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించిన కేబినెట్‌.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది.. క‌రోనా పూర్తిగా నియంత్ర‌ణలోకి వ‌చ్చిన‌ట్టు కేబినెట్ పేర్కొంది. అలాగే కొత్తపేట లో ప్రస్థుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్’ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది. వీటిలో…. చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో… ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో… మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆరార్ మధ్యలో.. మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లను., టిమ్స్ ను కలిపి నాలుగు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.