తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.
ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, 59 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీరిలో 24 మందికి ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 172 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,625 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
