Site icon NTV Telugu

తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు..

ద‌క్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వేరియంట్ 70 దేశాల‌కు పైగా పాకేసింద‌ని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ వేరియంట్ మ‌న దేశంలోనూ క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 గా న‌మోదు అయింది. అయితే.. ఇవాళ ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు కెన్యా నుంచి వ‌చ్చిన వార‌ని… మ‌రోక‌రు ఇండియా వ్య‌క్తి అని స‌మాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక కేసులు పెర‌గ‌డంతో.. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ అల‌ర్ట్ అయింది.

Exit mobile version