Site icon NTV Telugu

Pulse Polio : 4.41 లక్షల మంది చిన్నారులకు పొలియో చుక్కలు

పోలియో చుక్కల పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు ఐదుసంవత్సరాల్లోపు చిన్నారులందరికీ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ సెంటర్లు, పంచాయతీ కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. పోలియో సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇందిరాపార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. చిన్నారులకు పోలియో చుక్కల మందును వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆదివారం సాయంత్రం నాటికి 4.41 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. మరో మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్లు వేయనున్నారు. బడంగ్‌పేట్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మంత్రి సబితారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. మేయర్‌ పారిజాతారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version