Site icon NTV Telugu

జంటనగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

ఈనెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ జంట నగరాల పరిధిలో 79 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుపుతున్నారు. అయితే ఈనెల 17న వాటిలో 36 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు

వాటిలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తిరిగే 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య తిరిగే 9 ఎంఎంటీఎస్ రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య తిరిగే 8 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య తిరిగే 8 ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య తిరిగే ఒక రైలు, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య తిరిగే ఒక రైలు ఉందని అధికారులు ప్రకటించారు. ఆయా రైళ్ల వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన ట్వీట్‌ను పరిశీలించవచ్చు.

Exit mobile version