NTV Telugu Site icon

బీబీ న‌గ‌ర్‌‌లో 35 మంది యువ‌కుల‌కు క‌రోనా.. క్రికెట్ మ్యాచే కార‌ణం..!

covid 19

కంటికి క‌నిపించ‌ని మాయ‌దారి క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియ‌ని ప‌రిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాల‌ని, మాస్క్ ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్లు వాడాల‌ని, గుంపులుగా ఉండొద్ద‌ని ఎంత ప్ర‌చారం చేసినా.. కొంద‌రు పెడ‌చెవిన పెడుతూ క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువ‌కులు కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడిన‌ట్టు చెబుతున్నారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీబీ నగర్ మండ‌లం ముగ్ధంపల్లిలో కరోనా కలకలం సృష్టించింది… కొంత‌మంది యువ‌కులు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతుండంతో.. అంద‌రికీ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గారు.. అందులో 35 మంది యువకులకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. అంద‌రినీ హోం ఐసోలేష‌న్‌లో పెట్టారు అధికారులు.. దీనికి కార‌ణం మాత్రం క్రికెట్ మ్యాచే అని చెబుతున్నారు.. ఎందుకంటే.. కొద్దిరోజుల క్రితం యువకులంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడార‌ని చెబుతున్నారు.