NTV Telugu Site icon

Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు

Cannabis Chocolates

Cannabis Chocolates

Cannabis Chocolates: ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గాంధీ నగర్‌లో ఎక్సైజ్ అధికారులు ఈ గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. గాంధీ నగర్‌లో కిరణం దుకాణం నిర్వహిస్తున్న ఫిరోజ్ జెనా (39) ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జెనా కిరణం దుకాణం, అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఫిరోజ్ జేన కిరణం షాప్, ఇంట్లో తనిఖీలు చేయగా 34 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నట్లు అధికారుల వెల్లడించారు. ఒరిస్సా నుండి గంజాయి చాక్లెట్స్ లను ఫిరోజ్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. స్కూల్ స్టూడెంట్స్, లేబర్ టార్గెట్ గా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడని, రామంతపూర్ పరిధిలోని మరికొన్ని కిరాణా షాపులు, పాన్ షాపులకు గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడని అన్నారు. అయితే ఏఏ కిరాణా షాపుల్లో గంజాయి విక్రయించాడని ఆరా తీస్తున్నారు. గాంజాయికి బానిసైన యువత ఎవరని వారిని కూడా పట్టుకుని విచారించేదుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని హెచ్చారించారు.

Read also: Kishan Reddy: 4 నెలలుగా ఎందుకు చేయలేదు.. అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్

అయితే ఈ ఘటనపై రామంతపూర్ లో గాంధీనగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు గంజాయి బ్యాచ్ లు హల్ చల్ చేస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు, మహిళలను వెంటపడి వేధిస్తున్నారని తెలిపారు. రాత్రి 10 తర్వాత గాంధీనగర్ మీదుగా వెళ్ళాలి అంటేనే దడ పుడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తులతో బెదిరించి ఫోన్ లు, డబ్బులు లాక్కుంటున్నారని అన్నారు. కిరాణా షాపులు, పాన్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పార్క్ అడ్డాగా గంజాయి బ్యాచ్ లు ఉంటున్నాయన్నారు. ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్ లు, దాడులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే విద్యార్థులు గంజాయికి బానిసయ్యే పరిస్థులు ఎదురవుతాయని అంటున్నారు.
Skydiver: 29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం.. పారాచూట్ విఫలం కావడంతో ప్రమాదం..