Site icon NTV Telugu

Nizamabad: అయ్యో దేవుడా.. పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతి

Nizamabad

Nizamabad

Nizamabad: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషసర్పాలు, తేళ్లు అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. చీకటి, వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు జనావాసాల్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసరాలను చెత్తాచెదారం, చిందరవందరగా వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ఇంట్లోకి జీవాలు రాకుండా గుంతలుంటే తలుపులు మూసేయాలని సూచించారు. కవరింగ్ దుప్పట్లు మరియు వస్తువులను రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. చీకటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిదని.. అలాగే కార్లు, బైక్‌లు, హెల్మెట్‌లు తదితర వాటిని తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి వినియోగించాలి. అయితే ఓ కుటుంబం చేసిన నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. రెండు పాములు కాటువేయడంతో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆస్పత్రిలో చేర్పించి మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Read also: Minister RK Roja: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ, పార్టీ ఎందుకు పెట్టారో పవన్‌కే తెలియదు..

నవీపేట్ మండలానికి చెందిన బినోస్ దంపతులు మంగళి భూమయ్య, హర్షిత. వీరికి కుమారుడు రుద్రాంశ్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోని ఓ గది కూలిపోయింది. దీంతో శుక్రవారం భూమయ్య కుటుంబం పక్కనే ఉన్న మరో గదిలో పడుకుంది. గాఢ నిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాంశ్‌ను కాటేశాయి. బాలుడు నిద్రలో బిగ్గరగా ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది లేచారు. తమ కుమారుడికి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇంతలో భూమయ్య బాలుడి సమీపంలోకి రెండు పాములు కదులుతున్నట్లు గమనించాడు. వెంటనే కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Minister RK Roja: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ, పార్టీ ఎందుకు పెట్టారో పవన్‌కే తెలియదు..

Exit mobile version