NTV Telugu Site icon

హైదరాబాదీలకు కొత్త టెన్షన్‌.. ట్రావెల్‌ హిస్టరీ లేకున్నా ముగ్గురికి ఒమిక్రాన్..

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే తెలంగాణను టచ్ చేసింది.. రోజురోజుకీ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతూనేఉంది.. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 6 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 62కు చేరింది.. మరో విషయం ఏంటంటే.. ఆ 62 మందిలో 46 మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉన్నారు.. దీంతో.. వ్యాక్సిన్‌ తీసుకోనివారిపై ఈ కొత్త వేరియంట్‌ త్వరగా ఎటాక్‌ చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.. మరోవైపు.. ట్రావెల్‌ హిస్టరీ లేనివారిలోనూ ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడడం కలకలం సృష్టిస్తోంది.. హైదరాబాద్‌లో ట్రావెల్‌ హిస్టరీలేని ముగ్గురిలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా.. మరొకరు గర్భిణి మహిళ, మరో వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అయితే, ట్రావెల్‌ హిస్టరీ లేకుండా.. ఒమిక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.