Site icon NTV Telugu

Telangana:1201 విద్యుత్తు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుద‌ల‌

South

South

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల పాలిట బంగారు హస్తం అయ్యింది. గత ఏడాది కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల ఎదురైన సంగతి తెలిసిందే..ఇప్పుడీప్పుడే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.

ఇప్పటికే ప్రముఖ కంపెనీలలో ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యొగాలు భర్థీ అయ్యాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్ నిరుద్యొగులకు వరం లా మారింది.

ఇటీవల స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ కింద ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇప్పుడు మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి జరుగుతుంది.

రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌, 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు.

సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం http://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంస్థ పరిధిలోని నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు రూ. 200 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు. వీరు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

విద్యార్హతలు: ఎస్సెస్సీతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసై ఉండాలి.
వయస్సు: 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

షెడ్యూల్‌ తేదీలు

ఫీజు చెల్లింపు ప్రారంభం మే 19, 2022
దరఖాస్తులు ప్రారంభం మే 19, 2022
దరఖాస్తులకు తుది గడువు జూన్‌ 8, 2022
హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ జూలై 11, 2022
రాత పరీక్ష జూలై 17, 2022

సబ్‌ ఇంజినీర్‌
మొత్తం పోస్టులు 201
జనరల్‌ 182 పోస్టులు
లిమిటెడ్‌ కోటాలో 19
విద్యార్హత: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా డిగ్రీ.
వయస్సు: 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.

షెడ్యూల్‌ తేదీలు
ఫీజు చెల్లింపు ప్రారంభం జూన్‌ 15, 2022
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జూన్‌ 15, 2022
దరఖాస్తులకు తుది గడువు జూలై 5, 2022
హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ జూలై 23, 2022
రాత పరీక్ష జూలై 31, 2022

Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద

Exit mobile version