Talasani Srinivas: హైదరాబాద్ లోని బల్కంపేట పేట అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ అధికారులు శాలువా కల్పి సాదరంగా ఆహ్వానించారు. అమ్మవారి దర్శన అనంతరం తలసాని మాట్లాడుతూ.. జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్స వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని అన్నారు. ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పించనున్నామని తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులకు షాపులను ఉచితంగా కేటాయించామని వెల్లడించారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా 2.20 కిలోల బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు తయారయ్యాయని మంత్రి తలసాని చెప్పారు.
Read also: Health Tips: ఆపిల్ గింజలతోనే జ్యూస్ చేస్తున్నారా?
కొత్త సచివాలయంలోని తన ఛాంబర్‌లో బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం ఏర్పాట్లపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయంలో కల్యాణం నిర్వహించగా భక్తులు అసౌకర్యానికి గురయ్యారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో అధికారులు ఆలయం ముందు షెడ్డు నిర్మించి కాలయాపన చేశారని మండిపడ్డారు. ఈ ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. చిన్నతరహా వ్యాపారాల కోసం ఆలయం సమీపంలో నిర్మించిన దుకాణాలను మే 4న ప్రారంభించి అర్హులైన వ్యక్తులకు ఉచితంగా అందజేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. నూతనంగా ఎన్నికైన బల్కంపేట ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయశారు.
CM KCR: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్.. ప్రారంభించిన సీఎం