Bike Thieves: పార్కింగ్ వాహనాలే టార్గెట్.. మాస్టర్ కీ సాయంతో దొంగతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Thieves: పార్కింగ్ చేసిన వాహనాలే వీరి లక్ష్యం. ఎవరైనా బైక్లు, స్కూటర్లు పార్కింగ్ చేస్తుంటే మాస్టర్ కీ ద్వారా లాక్ చేయడంలో వారి హస్తం ఉంటుంది. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 19కి పైగా వాహనాలు చోరీకి గురయ్యాయి. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ చింతల్మెట్కు చెందిన అక్బర్ మీర్జా, నాంపల్లికి చెందిన అబ్దుల్ సలీం ఖాన్ అలియాస్ సలీం, బహదూర్పురా ఎంఎం ఖయ్యూమ్కు చెందిన మీర్ వాసీ హైదర్ మూసావి, మాసబ్ ట్యాంక్ శ్యామ్నగర్కు చెందిన రాజు ముఠాగా ఏర్పడ్డారు.
Read also: Telangana Formation Day: నేడే రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు.. కార్యక్రమాల వివరాలు..
Also Read
నివాస ప్రాంతాల్లో వివిధ కూడళ్లు, కార్యాలయాల ముందు పార్క్ చేసిన వాహనాలను గుర్తిస్తారు. దాని యజమాని లేకపోవడాన్ని గమనించి తమ వద్ద ఉన్న మాస్టర్ కీ సాయంతో దాన్ని ప్రారంభించి దొంగిలిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 19 వాహనాలు చోరీకి గురయ్యాయి. వీరిలో అబ్దుల్ సలీం ఖాన్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీపీ సంజయ్ కుమార్ నేతృత్వంలో సైఫాబాద్ డీఐ నరేష్, ఎస్సై నిరంజన్ బృందం నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి నుంచి దాదాపు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Telangana Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైన తెలంగాణ..
తాజావార్తలు
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!