NTV Telugu Site icon

Bike Thieves: పార్కింగ్‌ వాహనాలే టార్గెట్‌.. మాస్టర్‌ కీ సాయంతో దొంగతనం

Bike Threef

Bike Threef

Bike Thieves: పార్కింగ్ చేసిన వాహనాలే వీరి లక్ష్యం. ఎవరైనా బైక్‌లు, స్కూటర్లు పార్కింగ్ చేస్తుంటే మాస్టర్ కీ ద్వారా లాక్ చేయడంలో వారి హస్తం ఉంటుంది. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 19కి పైగా వాహనాలు చోరీకి గురయ్యాయి. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌కు చెందిన అక్బర్ మీర్జా, నాంపల్లికి చెందిన అబ్దుల్ సలీం ఖాన్ అలియాస్ సలీం, బహదూర్‌పురా ఎంఎం ఖయ్యూమ్‌కు చెందిన మీర్ వాసీ హైదర్ మూసావి, మాసబ్ ట్యాంక్ శ్యామ్‌నగర్‌కు చెందిన రాజు ముఠాగా ఏర్పడ్డారు.

Read also: Telangana Formation Day: నేడే రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు.. కార్యక్రమాల వివరాలు..

నివాస ప్రాంతాల్లో వివిధ కూడళ్లు, కార్యాలయాల ముందు పార్క్ చేసిన వాహనాలను గుర్తిస్తారు. దాని యజమాని లేకపోవడాన్ని గమనించి తమ వద్ద ఉన్న మాస్టర్ కీ సాయంతో దాన్ని ప్రారంభించి దొంగిలిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 19 వాహనాలు చోరీకి గురయ్యాయి. వీరిలో అబ్దుల్ సలీం ఖాన్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీపీ సంజయ్ కుమార్ నేతృత్వంలో సైఫాబాద్ డీఐ నరేష్, ఎస్సై నిరంజన్ బృందం నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి దాదాపు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Telangana Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైన తెలంగాణ..