Playing Poker: పేకాట ఆడుతున్న వాళ్ల ఆటను కట్టించారు సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఉన్న రామచంద్రపురం ఎస్‌ఓటీ పోలీసులు. కొల్లూరు ఓ ఫామ్ హౌస్ లో రాత్రి పేకాట ఆడుతున్నారనే పక్కా సమారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులో తీసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ చెందిన ఫామ్ హౌస్ గా పోలీసులు గుర్తించారు.
Read also: BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. మెన్ ఇన్ బ్లూతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
స్థానిక సమచారంతో రామచంద్రపురం పోలీసులు, ఎస్ పోటీ పోలీసుల సంయుక్తంగా దాడులు జరడంతో పేకాట భాగోతం బయటపడింది. పేకాట ఆడుతున్న వారి వద్దనుంచి 13 లక్షలు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ చెందిన ఫామ్ హౌస్ కావడంతో.. విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్ట విరుద్దంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా వదిలేది లేదని పోలీసులు అన్నారు.
MLA Koneru Konappa: అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్..