రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సులపై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదిన్నర తర్వాత విద్య సంస్థలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా విద్యార్ధులను తరలించే బస్సుల పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నార్సింగీ, కొండాపూర్, చేవెళ్ళతో పాటు శంషాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తుంది అధికారుల బృందం. అయితే నిన్న 12 బస్సులను సీజ్ చేసిన అధికారులు నేడు నిబంధనలు పాటించని మరో స్కూల్ 15 బస్సులను సీజ్ చేసారు రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్‌నెస్, రోడ్డు ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్స్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు విద్యార్థుల సామర్ద్యం పై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు.
నేడు మరో 15 స్కూల్ బస్సులను సీజ్ చేసిన అధికారులు…
