NTV Telugu Site icon

11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?

Panchayat Office

Panchayat Office

11 Crore Current Bill: ఒక ఇంటికి సాధారణంగా ఉపయోగించే యూనిట్లను బట్టి నెలవారీ విద్యుత్ బిల్లు వస్తుంది. మనం వాడిన యూనిట్లను బట్టే వంద నుంచి వెయ్యి వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. కమర్షియల్ అంటే.. దుకాణాలు.. కంపెనీలు.. పరిశ్రమలు.. పదివేల నుంచి లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఓ గ్రామకి అయితే కోట్లల్లో బిల్లు రావడంతో అధికారులకు దిమ్మతిరిగేంత అయింది. ఇదేంది సామీ ఈ పంచాయితీ కోట్లల్లో బిల్లేంటి అంటూ మైండ్‌ బ్లాంక్‌ అయ్యింత పని అయ్యింది. పోనీ ఆ పంచాయితీ ఆఫీసు ఓ 20-30 గదులు వున్నాయా అంటే అదీ లేదు.. కేవలం రెండేసి గదులకు కోట్లు బిల్లు వామ్మో ఇదేంది అని అధికారులకు కల్లల్లోంది నీల్లు వచ్చేంత పనైంది. ఇది నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం. ఇంత ఆశ్చర్యానికి గురి చేసే ఘటన కామారెడ్డి జిల్లా కొత్తపల్లిలో చోటుచేసుకుంది.

Read also: Municipal workers: వేతనాలు ఇవ్వండి.. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్మకులు నిరసన

ఓ సాధారణ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చే కరెంటు బిల్లు చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం. రెండు గదులు మాత్రమే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి నెలవారీ కరెంటు బిల్లు 11 కోట్ల 41 లక్షలు వచ్చింది.  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి 11 కోట్ల 41 లక్షల 63 వేల 672 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ కరెంటు బిల్లు చూసి సర్పంచ్, సెక్రటరీ కరెంట్‌ షాక్‌ కొట్టినంత పనైంది. ఏళ్ల తరబడి కట్టక పోయినా పెండింగ్ బిల్లు అంతగా రావడం లేదు. అలాంటిది మరీ ఇంత రావటమేంటీ అని పంచాయితీలో పనిచేసేవాళ్లకు బుర్ర తిరిగినంతపనైంది. అయితే.. గ్రామ పంచాయతీ కార్యాలయానికి పదకొండు కోట్ల కరెంట్ బిల్లు రావడంపై గ్రామస్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిల్లు ఎలా వస్తుందని సర్పంచ్, కార్యదర్శి విద్యుత్ అధికారులను ప్రశ్నించారు.

Read also: Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు

ఓ వైపు ప్రభుత్వం నుంచి నిధులు రాక పంచాయతీలు అల్లాడిపోతుంటే.. కరెంటు బిల్లులు ఇలా షాకిస్తుంటే ఏం చేయాలి? విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామ పంచాయతీ కార్యాలయానికి కోట్లలో కరెంటు బిల్లు వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బిల్లుపై మాచారెడ్డి ఏఈ వెంకటరమణను సంప్రదించగా.. మిషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యుత్‌ బిల్లు వచ్చిందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామ పంచాయతీ కార్యాలయానికి అధిక కరెంట్‌ బిల్లు వస్తే వెంటనే స్పందించారు. అయితే మా బిల్లులు కూడా ఇలానే వస్తే మమ్మల్ని ఆదుకోనే వారు ఎవరు? తమ బిల్లులుకూడా అధికంగా రాకుండా చూడాలని ఇలాంటి ఘటనలు మల్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Read also: Triple Talaq: భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి యూకేకు పయనం.. ఎయిర్‌పోర్టులో భర్త అరెస్ట్

ఏసీడీ చార్జీల మోత..

మరోవైపు తెలంగాణలో ఏసీడీ చార్జీల పేరుతో పెద్ద ఎత్తున కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువ కరెంట్ బిల్లులు వస్తున్నాయన్నారు. సాధారణ గ్రామ పంచాయతీలో నివసించే గృహాలకు నెలకు రూ.1,000 నుంచి 4,000 వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. పట్టణాలు, నగరాల్లో కూడా ఇంత కరెంట్ బిల్లు రావడం లేదని బాధిత గ్రామస్తులు విద్యుత్ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంటు సరఫరా నిలిచిపోయి జరిమానా కూడా ఎక్కువేనని కరెంట్ బిల్లుల బాధితులు వాపోతున్నారు. పెరిగిన కరెంట్ బిల్లుల వల్ల ప్రతినెలా తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫెర్రో అల్లాయ్స్ సెక్టార్ కరెంట్ బిల్లును యూనిట్ కు మూడు రూపాయలు పెంచిందని ఆయా పరిశ్రమల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర కంపెనీలకు రూ.3 పెంచిన ప్రభుత్వం రూ.3 ఎందుకు పెంచలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో పెద్దఎత్తున కరెంట్ బిల్లులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని బాధిత యజమానులు వాపోయారు.
Salman Bhai: KKBKKJ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చేసింది… ఇదేమి లుక్ మావా బ్రో?