NTV Telugu Site icon

SSC Exam Hall Tickets: నేటి నుంచి వెబ్‌సైట్‌‌లో ‘పదోతరగతి’ హాల్‌టికెట్లు

10th Class

10th Class

SSC Exam Hall Tickets: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read also: Tension in Osmania university: ఓయూలో ఉద్రిక్తత.. జేఏసీ నాయకుల అరెస్ట్‌

ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకెండ్ లాంగ్వేజ్,, 6న ఇంగ్లిష్‌, 8న గణితం, 10న సైన్స్‌ (భౌతికశాస్త్రం, జీవశాస్త్రం), 11న సోషల్, 11న ఓరియంటల్‌ పేపర్‌-1, ఒకేషనల్‌ కోర్సులు 12న ఓరియంటల్‌. 13న పేపర్-2. ఆ తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 5.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నపత్రం (బిట్ పేపర్) చివరి 15 నిమిషాల్లో ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన రెండు ప్రశ్నాపత్రాలను ఒకే సమయంలో కాకుండా నిర్ణీత సమయంలో విద్యార్థులకు వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు ఆరు పేపర్లు మాత్రమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Inspector : హెల్ప్ చేస్తాడని స్టేషన్ కెళ్తే.. రూంకి రమ్మన్న ఇన్ స్పెక్టర్