NTV Telugu Site icon

10th answer sheets Missing: ఆదిలాబాద్‌లో పదోతరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్‌..!

Missing Answer Sheets

Missing Answer Sheets

10th answer sheets Missing: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. వికారాబాద్‌ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్‌ చేసిన ఘటన మరువకముందే.. ఆదిలాబాద్‌ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది. పోస్టు ఆఫీస్ నుంచి బస్టాండ్ కు తరలిస్తుండగా ఒక్క కట్ట జవాబు పత్రాలు మిస్ అయినట్లు తెలిపారు. ఆటోలో తరలిస్తుండగా మిస్ అయినట్టుగా పోస్ట్ మాస్టర్ హరీష్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లను అధికారులకు ఫిర్యాదు చేశారు. మాయమైన జవాబు పత్రాల కట్టలో సుమారు 30 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎవరు జవాబు పత్రాలను కొట్టేశారు. ఆటోలో తరలిస్తున్నప్పుడే మిస్‌ అయ్యాయా? లేక ఆటో ఎక్కడైన ఆపడం వలన ఎవరైనా పేపర్ల కట్టను దొంగలించారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, తనతో పాటు ఆటోలో వెళ్లిన వారిని, పాఠశాలనుంచి ఆన్సర్‌ సీట్ పేపర్ల కట్టను ఎవరు ఆటోలో పెట్టారో వారిని విచారించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..

ఇదిలా ఉండగా.. వికారాబాద్‌ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సస్పెండ్‌ చేయగా.. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ కె.గోపాల్‌, ఇన్విజిలేటర్లు ఎస్‌.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్‌ వేటు వేశారని తెలిపారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. కాసేపటికే 9.37 గంటలకు బందెప్ప మరో ఉద్యోగి సమ్మప్పకు వాట్సాప్‌ పంపించారని వెల్లడించారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందన్నారు. నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని.. నేటి నుంచి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.
Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి

Show comments