NTV Telugu Site icon

దళిత బంధు: పురుగుల మందు డబ్బాలతో ధర్నా.. ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో దళితులు ధర్నా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు.