నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని పట్టపగలు కొట్టి చంపిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, ఎవరైనా వ్యక్తులు లేదా గ్రూపులు భౌతిక దాడులు లేదా హత్యలకు పాల్పడితే, వారి స్థితి లేదా సంబంధాలతో సంబంధం లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని డీజీపీని ఆదేశించారు..
Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- నారాయణపేట హత్య పై సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన చర్యలు