Telangana Assembly: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఇక 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసింది. 2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందన్నారు. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉండగా.. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగిందని.. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే.. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదన్న ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది.
Read also: Nawaz Sharif: మా దేశ ఆర్థిక స్థితికి భారత్ కారణం కాదు..
మరి దీనిపై ప్రతిపక్ష నేతలు ఏం సమాధానం ఇవ్వనున్నారు తెలియాల్సి ఉంది. శాసన సభలో మళ్లీ వాడి వేడి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పులు ఊబిలో తెలంగా ఉందని అధికారపక నేతలు విపకాలపై విరుచుకుపడుతున్నాయి. అప్పులే కాదు ఆస్తులు కూడా పెరగాయని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే దీనిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయడంతో.. శాసనసభలో ఆర్థిక స్థితిగతులపై హాట్ హాట్ గా చర్చ జరగనుంది. ఆర్థిక పరిస్థితిపై 42 పేటీలు ఇచ్చిన నిమిషంలోనే మాట్లాడమంటే ఎలా? అంటూ విపకాలు ప్రశ్నించాయి. కనీసం అరగంట పాటు సమయం ఇవ్వాలని అందులో ఏముందో తెలుసుకుని ప్రశ్నిస్తే బాగుంటుందని అన్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం కాగానే అరగంటపాటు వాయిదా పడింది.
Nawaz Sharif: మా దేశ ఆర్థిక స్థితికి భారత్ కారణం కాదు..