Number of Votes Polled to Barrelakka in Elections: తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తిని కలిగించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు వచ్చే ఓట్ల సంఖ్య, ఆమె విజయావకాశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ముందు తల్లి మద్దతుతో నామినేషన్ వేసింది. ఆమె ధైర్యంగా వేసిన ముందడుగుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగులు, విద్యావేత్తల నుంచి ఊహించని రీతిలో మద్దతు కూడా లభించింది. అలాంటి బర్రెలక్కకు జనం ఎంత మంది ఓటుతో మద్దతు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరం. బర్రెలక్క మాకు ఏమాత్రం పోటీ కాదు, ఆమె వల్ల కేవలం ఒకటి నుంచి రెండు వేల ఓట్లు మాత్రమే అటూ ఇటూ అవుతాయి తప్ప పెద్దగా ప్రభావం చూపలేదు ఆమెను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన పని కూడా లేదని ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతూ వచ్చారు.
Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..
ఇక ఎన్నికలు ముగియాయనే ఆరా మస్తాన్ విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం.. బర్రెలక్కకు ఏకంగా 10 నుంచి 15 వేల ఓట్లు వస్తాయని కూడా చెప్పారు. ఈ సర్వే ఫలితాలను బట్టి బర్రెలక్క గట్టిగానే ప్రభావం చూపినట్టు భావించినా రెండో రౌండ్ ముగిసే సరికి ఆమెకు కేవలం 735 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు లీడింగ్ లో ఉండగా తరువాతి స్థానాల్లో బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో అప్పడు బీఆర్ఎస్‌లో ఉన్న జూపల్లి కృష్ణా రావుపై కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కేవలం 12,546 ఓట్లతో గెలుపొందగా ఈసారి వారి పార్టీలు తారుమారయ్యాయి. ప్రచారం సమయంలో బర్రెలక్కకు మద్దతు తెలిపిన వాళ్లంతా బయటి నియోజకవర్గాలకు చెందిన వాళ్లే కావటం గమనార్హం.