NTV Telugu Site icon

KTR: మళ్లీ అధికారం మాదే.. ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ స్పందన

Ktr

Ktr

తెలంగాణ పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్ని బీఆర్ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌దే అధికారం అంటున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈసారి కూడా తమదే అధికారం అంటున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ గతంలో కూడా చూశాం. మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో మేమే గెలుస్తున్నాం.

Also Read: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్‌ అంటే..?

డిసెంబర్ 3న మీరే చూస్తారు, ఇప్పుడు వచ్చిన exit poll తప్పు అని.. మీరే తెలుసుకుంటారు. ఇదే నేషనల్ మీడియా గతంలోనూ ఇలాంటి ఫలితాలే ఇచ్చింది. కానీ మేమే అధికారం చేపట్టాం. ఇవాళ ఇచ్చిన exit poll పోల్ తప్పని.. ఇవాళ ఇచ్చిన ఫలితాలు నిజం కాదని.. డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా?. మళ్ళీ కేసిఆర్ సీఎం కాబోతున్నారు. ఫైనల్ పోలింగ్ శాతం అనేది రేపు ఉదయం వస్తుంది. ఆ తర్వత అనాలసిస్ చేయండి’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read: Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా..?

Show comments