Site icon NTV Telugu

Telangana Elections: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతోంది: కర్ణాటక మాజీ మంత్రి

Ashwath Narayan

Ashwath Narayan

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని కర్ణాటక మాజీ డిప్ఊటీ సీఎం, బీజేపీ నేత అశ్వత్‌ నారాయణ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజీపీ పార్టీ తరపున ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, అక్కడ ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని అన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదన్నారు. అమలుసాధ్యం కాని హామీలు, మోసపూరిత మాటలతో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.

ఇప్పడు ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందని, వాళ్లు చెప్పిన గ్యారెంటీలు, పనులకు నాలుగునెలల్లో కనీసం పదిశాతం నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. అన్నభాగ్య పథకం కింద పదికిలోల బియ్యం అన్నారు.. కనీసం 5కిలోలైనా ఇవ్వడంలేదని ఆరోపించారు. శక్తి ప్రోగ్రామ్ కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు.. నిత్యం 84 లక్షలమంది ప్రయాణం చేస్తుంటే.. కార్పొరేషన్ కు నిధులు విడుదలచేయలేదని చెప్పారు. బస్సుల తగ్గింపుతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కర్ణాటక మోడల్ అని ఇక్కడ చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నో డెవలప్ మెంట్, నో గవర్నెన్సే కర్నాటక మోడల్‌ అని ఆయన ఎద్దేవ చేశారు. కర్ణాటక పవర్ సర్ ప్లస్ స్టేట్‌లో విద్యుత్ కొరత నెలకొందని అశ్వత్‌ నారాయణ ఆరోపించారు.

Exit mobile version