NTV Telugu Site icon

DK Shivakumar: కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌజ్‌కి పంపండి

Dk Shivakumar

Dk Shivakumar

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి చేరుకున్న ఆయన హనుమకొండ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలో జరిగని సభలో ఆయన ప్రసంగించారు. సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్‌ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని పేర్కొన్నారు.

Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన

2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు పరచలేదు, అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పాడన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఓడించి పర్మినెంట్‌గా ఫామ్ హౌస్‌లో ఉంచాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని సీపీఐ, వైఎస్సార్ సీపీ మద్దతిస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో మీరందరూ సంబరాలు చేసుకున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ ఒక టీంను పంపియండి మీకే తెలుస్తుందని పేర్కొన్నారు.

Also Read: Viral Video : భయంకరమైన యువకుడి బైక్ స్టంట్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఒక దళితున్ని కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, కర్ణాటకలో లాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను నిలబెట్టని కేసీఆర్ ప్రభుత్వం మనకు అవసరమా? అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి రోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండెనో మళ్ళీ అదే విధంగా కాంగ్రెస్ రాష్ట్రమంతా కనబడుతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.