హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 127 పోలింగ్ స్టేషన్ల లో 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్ కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు పోలింగ్ అధికారులు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Friends Attacked Private Parts:మీరేం ఫ్రెండ్స్ రా … బాగా తాగి.. స్నేహితుడిని ఏం చేశారో తెలుసా..
509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశామని…ఇప్పటికే ఈవిఎం ల ర్యాండమైజేషన్ పూర్తయిపోయిందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల టైంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల 90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు..ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేసామని అధికారులు తెలిపారు. అంతే కాకుండా మజీద్ ల వద్ద ప్రచారం చేసినందుకు బీ ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ లు ప్రచారం చేసినందుకు మరో కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Read Also:Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్ర బలగాలు రానున్నాయి. ఏడు కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 16 వందల మంది లోకల్ పోలీసులతో భారీ బందో బస్త్ నిర్వహించనున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల రిజిస్టర్ ను ఎన్నికల వ్యయ పరిశీలకులకు చూపించాలని ఆదేశాలు జారీ చేశారు…పది వేలకు పైగా చేసే ప్రతీ పేమెంట్ చెక్కు రూపంలో ఉండాలని ఆదేశాలిచ్చారు అధికారులు.
Read Also:Suspended: రెస్టారెంట్‌లో అన్నచెల్లెళ్లిని వేధించిన పోలీస్ అధికారి.. తర్వాత ఏమైందంటే..
తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో ఎన్నికల సందడి మొదలైంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరో వైపు బీజేపీ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. అయితే మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో ప్రచారం కొనసాగిస్తున్న బీఆర్ఎస్.. ఎలాగైనా.. ఇక్కడ గెలవాలని చూస్తోంది. మిగిలినా పార్టీలన్ని తమ వంతు కృషి చేస్తున్నాయి. ఏదీ ఏమైనా.. జూబ్లీహిల్స్ లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.. అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మరణంతో.. కార్యకర్తలు, నేతలు ఈరోజు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు మాత్రం తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.
