NTV Telugu Site icon

Telangana Election Results 2023: ఓపెన్‌ చేసి దర్శనమిచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు?

High Tension At Ibrahimpatnam Rdo Office

High Tension At Ibrahimpatnam Rdo Office

High tension at Ibrahimpatnam RDO Office: ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిన్న రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ అడ్డుకోబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు సల్ప లాటి ఛార్జ్ చేశారు. 29వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి‌ అధికారులు పంపించ లేదని కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఈ విషయం తెలిసి ఆర్డీవో కార్యాలయానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో తరువాత పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూంకు తరలించారు అధికారులు. అయితే అప్పుడు స్ట్రాంగ్ రూమ్ కి సీల్ వేయకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే సీల్ వేశారు అధికారులు. అయితే పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డీఓను కాంగ్రెస్ శ్రేణులు నిలదీస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Election Results 2023 Live : ఎవరి ధీమా వారితే.. మరి కాసేపట్లో తేలనున్న పార్టీల భవితవ్యం

ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి ఎన్నికల అబ్జర్వర్‌, కలెక్టర్‌ భారతి హోలీకేరి చేరుకోగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌, స్వతంత్ర పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3057 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. ఈ అంశం మీద టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోస్టల్ బాలెట్ భద్రపరిచే విషయంలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది, ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈ సమయంలో పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడంలో కూడా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో పోస్టల్ బ్యాలెట్ లు ఆర్డీవో కార్యాలయంలోనే ఉన్నాయని, స్ట్రాంగ్ రూంలోకి ఎందుకు పంపలేదని ఆర్డీవో ను అడిగితే సమాధానం లేదని అన్నారు. ఇలాగే రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో జరిగింది అని మాకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన ఈ విషయంలో ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకొవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు.