NTV Telugu Site icon

Chetan Gonaik: ఒక్క చేతితో సంక్షేమం.. మరో చేతితో అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్‌కి మాత్రమే ఉంది

Chetan Gonaik

Chetan Gonaik

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళ బిఅర్ఎస్ ప్రభుత్వం.. నీళ్లకి నికరం లేదు, కన్నీళ్లకు కనికరం లేదు,నిధులు గులాబీ గదుల నిండా, నియామకాలు ఒక కెసిఅర్ కుటుంబం పండగలా అయ్యందని ఆల్‌ ఇండియా యూత్‌ కాంగ్రెస్‌ మీడియా విభాగం ఇంచార్జీ చేతన్‌ గోనాయక్‌ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చిన్న గారి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేఎల్‌ఆర్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతన్‌ గోనాయక్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు.

Also Read: Supreme Court: మరో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ చేసినా.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చు..

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళ బిఅర్ఎస్ ప్రభుత్వం.. నీళ్లకి నికరం లేదు, కన్నీళ్లకు కనికరం లేదు, నిధులు గులాబీ గదుల నిండా, నియామకాలు ఒక కుటుంబానికే పండగలా చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని, దీనిలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంపద సృష్టించడం బాగా తెలుసని, ఒక్క చేయితో సంక్షేమం మరో చేతితో అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అది 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరు చూశారన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 8 కోట్ల ప్రజలకు 50 వేల కోట్ల బడ్జెట్‌తోనే ఆనాడు రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్ మెంట్, 108,104, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, వృద్దులకు, వితంతువులకు పించన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాని గుర్తు చేశారు.

Also Read: Hyderabad: మైనర్‌ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్‌ కానిస్టేబుల్‌

ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ మెట్రో, బాసర IIIT, KTPs సింగరేణి, జైపూర్ పవర్, నెల్లూరు పవర్ ప్రాజెక్ట్, రోడ్డు, మాడల్ స్కూల్స్, జల యజ్ఞం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందన్నారు. అదే ఇప్పుడు పక్కరాష్రం కర్ణాటకలో కూడా చేస్తున్నామని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చేతన్‌ గోనాయక్‌తో పాటు తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షుడు సిహెచ్ శైలేంద్ర, తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం కోఆర్డినేటర్ కప్పాటి శివరామకృష్ణా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, యూత్ కాంగ్రెస్ హైదరాబాద్‌ జిల్లా కోఆర్డినేటర్ హమూది తదితరులు పాల్గొన్నారు.