NTV Telugu Site icon

Kaleru Venkatesh: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుంది

Kaleru Venkatesh

Kaleru Venkatesh

ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో అంబర్పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ తన ప్రచారoలో స్పీడ్ పెంచారు. సోమవారం అంబర్‌పేట్ డివిజన్ ప్రేమ్‌నగర్‌తో పాటు పలు బస్తిలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పథకాలను వివరించారు. పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం పేరిట నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

Also Read: Alia Bhatt : అలియా భట్ ను టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. డీప్ ఫేక్ వీడియో వైరల్..

అభివృద్ధిని చూసి ఓటు వేస్తామని చెప్పినట్టు ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మూడు రోజుల్లో మళ్లీ తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కడతారని అన్నారు. గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారన్నారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాలేరు ఆరోపించారు.

Also Read: Kishan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు