Site icon NTV Telugu

Bandi Sanjay: ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. నువ్వు సాధించేదేమిటి గంగుల?

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ అశోక్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. కరీంనగర్ ప్రగతి కోసం రూ. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. గంగుల… నువ్వు సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్.. కోచింగ్ లేక బీసీ స్టడీ సర్కిల్ వెక్కిరిస్తోంది.. తీగల వంతెన వీక్లీ డ్యాన్స్ క్లబ్‌లా మారింది.. అంటూ ఎద్దేవా చేశారు. కబ్జాలు, కమీషన్లే కదా మీ భాగోతం అని విమర్శించారు.

Also Read: Raithubandhu: రైతులకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి

అనంతరం బండి మాట్లాడుతూ.. ‘3న కేసీఆర్ బాక్సులు బద్దలు కావడం పక్కా. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర నాది.. సమాజం కోసం జీవితాన్నే ధారపోసిన. బీజేపీ అధికారంలోకి వస్తే.. 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు రూ.15లు తగ్గిస్తాం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్ నగర్ ముస్లిం మహిళలకు బండికి తిలకం దిద్ది హారతి పట్టారు.

Also Read: Harish Rao: కర్ణాటకలో ఖర్గే సొంతూరిలో కరెంట్, నీరు లేదు..

Exit mobile version