తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఎల్లుండి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ మేనిఫెస్టోలో ఉండే అంశాలు మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Read Also: Train Accident: పట్టాలపై చెక్క దిమ్మె, ఇనుప రాడ్లు.. రైలును ఢీకొట్టించే కుట్ర
బీజేపీ మేనిఫెస్టోలో అంశాలు..
అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం,
ప్రతి వ్యక్తికి జీవిత భీమా
ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం
వరి క్వింటాల్ కు రూ. 3100
పంటల బీమా పథకం అమలు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటు
పెళ్లైన ప్రతి మహిళలకి సంవత్సరానికి రూ.12 వేలు
సిలిండర్ 500 రూపాయలకే
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా జమ ఔషధీ కేంద్రాలు
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20వేల రూపాయలు
యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలు జాబ్ క్యాలెండర్
6 నెలల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీ
ప్రతి నెల మొదటి వారం లో ఉద్యోగ నియామక పత్రాలు..
ఆధ్యాత్మిక టూరిజంకు ప్రాధాన్యత..
ఐఐటి ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు
ఫ్రీ విద్యుత్ పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులతో పాటు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు వర్తింపు.
ఫీజుల నియంత్రణకు చర్యలు
మహిళ సంఘాలకు, రైతులకు వడ్డీలేని రుణాలు..
బీసీ సబ్ ప్లాన్ అమలు..