Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..

  • ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ జెప్టోలో అందుబాటులోకి..
  • ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేగంగా డెలివరీ..
Zepto Iphone Pro

Zepto Iphone Pro

iPhone 18 Pro In Zepto: ఆపిల్ (Apple) లేటెస్ట్ ప్రీమియం డివైజ్‌లను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto)లో కూడా అమ్మకాలు జరగనున్నాయి. నేటి (సెప్టెంబర్ 18) ఉదయం 8 గంటల నుంచి జెప్టోలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 5 అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేల్ ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు మాత్రమే పరిమితం కానుంది.

ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో గరిష్ఠంగా రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. స్టోరేజ్, కలర్ వేరియంట్‌తో సంబంధం లేకుండా లిస్ట్ చేసిన ఐఫోన్లకు ఈ డిస్కౌంట్ వర్తించనుంది. మరోవైపు ఎయిర్‌పాడ్స్ 5పై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఫ్లాట్‌గా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్లు ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా చేసే కొనుగోళ్లకు కూడా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వర్తించనుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలుకు ఎంపిక చేసిన కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. జెప్టోలో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ వేరియంట్లు లిస్ట్ కానున్నాయి. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అన్ని స్టోరేజ్ వేరియంట్లలో బ్లాక్, సిల్వర్, బర్గండీ, గ్లేసియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 18 ప్రో 2టీబీ వేరియంట్ మాత్రం బర్గండీ, గ్లేసియర్ రంగుల్లో మాత్రమే లభించనుండగా.. మిగతా స్టోరేజ్ వేరియంట్లు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌పాడ్స్ 5 విషయానికొస్తే.. వైట్ కలర్‌లో స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్ వేరియంట్ కూడా జెప్టోలో లభించనుంది. ఈ రెండు వేరియంట్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే బ్యాంక్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐకి సంబంధించిన పూర్తి నిబంధనలు కొనుగోలు సమయంలో జెప్టో యాప్‌లోనే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తమ కార్డుకు ఆఫర్ వర్తిస్తుందా లేదా అనేది కొనుగోలు చేసే ముందు వినియోగదారులు చెక్ చేసుకోవడం మంచిది.

ఇక వారంటీ విషయానికొస్తే.. జెప్టో నిబంధనల ప్రకారం ఉత్పత్తి వారంటీ బాధ్యత సంబంధిత తయారీదారుదే. అంటే ఐఫోన్‌కు సంబంధించిన వారంటీ ఆపిల్‌దే ఉంటుంది. అయితే రిటర్న్, రీఫండ్, ఎక్స్‌చేంజ్ నిబంధనలు జెప్టో పాలసీ ప్రకారం ఉంటాయి. ముఖ్యంగా ఖరీదైన ఎలక్ట్రానిక్స్‌కు అదనపు షరతులు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు రిటర్న్ పాలసీని తప్పనిసరిగా పరిశీలించాలి.