Site icon NTV Telugu

హోమ్ థియేటర్ అనుభవం ఇక ఇంట్లోనే.. ZEBRONICS Juke Bar 6500 పై రూ.11000 భారీ డిస్కౌంట్..!

Zebronics Juke Bar 6500

Zebronics Juke Bar 6500

ZEBRONICS Juke Bar 6500: ఇంటి వద్దే థియేటర్‌ తరహా ఆడియో అనుభవాన్ని పొందాలనుకునే వినియోగదారుల కోసం జీబ్రానిక్స్ (Zebronics) సౌండ్‌బార్ ZEBRONICS Juke Bar 6500 (ZEB-SBSPK C10) ను ఎంపికగా చేసుకోవచ్చు. ఈ సౌండ్‌బార్ డాల్బీ ఆడియో సపోర్ట్‌, 200W పవర్ అవుట్‌పుట్‌, బ్లూటూత్ కనెక్టివిటీతో మీ లివింగ్ రూమ్‌ను నిజమైన సినిమా హాలుగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఆడియో పనితీరు పరంగా చూస్తే, ZEB-Juke Bar 6500 మొత్తం 200W RMS అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తాన్ని ఆడియోతో నింపి, ప్రతి బీట్‌, ప్రతి సంభాషణ‌, ప్రతి సౌండ్ ఎఫెక్ట్‌ను స్పష్టంగా వినిపిస్తుంది. సినిమాలు చూస్తూ, పాటలు వింటూ, లేదా గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు ఈ సౌండ్‌బార్ డైనమిక్ ఇంపాక్ట్‌ను సృష్టిస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో క్లియర్ సౌండ్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. డాల్బీ ఆడియో టెక్నాలజీ వల్ల రియల్ టైమ్ ఆడియో క్లారిటీ, సరిగ్గా డైరెక్షనల్ సౌండ్ ఇంపాక్ట్ లభిస్తుంది. ఇక 5.1 చానల్ కాన్ఫిగరేషన్‌తో కూడిన ఈ సిస్టమ్‌ వల్ల సినిమాటిక్ సౌండ్ అనుభవం మరింత సహజంగా, రియలిస్టిక్‌గా అనిపిస్తుంది.

ChatGPT 5.1: OpenAI ChatGPT 5.1 విడుదల.. ఇది చాలా స్మార్ట్ గురూ..

ఇక డిజైన్ విషయానికి వస్తే జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 6500 నలుపు రంగులో లభిస్తుంది. ప్యాక్‌లో సౌండ్‌బార్ యూనిట్‌, సబ్‌వూఫర్‌, రిమోట్ కంట్రోల్‌, ఇన్‌పుట్ కేబుల్‌, QR గైడ్‌, వాల్ మౌంట్ ఫాస్టెనర్స్ ఉన్నాయి. సౌండ్‌బార్‌లో 6.35 సెం.మీ డ్రైవర్స్ ఉంటే, సబ్‌వూఫర్‌లో 13.33 సెం.మీ డ్రైవర్ అమర్చబడింది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ సౌండ్‌బార్ Bluetooth 5.0 సపోర్ట్ తో వస్తుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్ వంటి పరికరాలకు వైర్‌లెస్‌గా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక దీన్ని ధర పరంగా చూస్తే ZEBRONICS Juke Bar 6500 ప్రస్తుతం రూ.6,999 ధరకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది. ఇది అసలు ధర రూ.17,999 కాగా.. ఏకంగా 61% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంతేకదొండోయ్.. SBI, Axis, Flipkart క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు లభ్యమవుతాయి. వినియోగదారుల కోసం No Cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

అడాప్టివ్ ANC టెక్నాలజీ, IP54 రేటింగ్, 33 గంటల బ్యాటరీ లైఫ్ తో Dell Pro Plus Earbuds లాంచ్..!

Exit mobile version