Site icon NTV Telugu

YouTube Shorts Daily Time Limit: హమ్మయ్య.. ఇకపై యూట్యూబ్ షార్ట్‌లకు రోజువారీ స్క్రోలింగ్ టైమ్ లిమిట్..!

Youtube Shorts

Youtube Shorts

YouTube Shorts Daily Time Limit: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు రోజులో ఎంతసేపు ‘Shorts’ ఫీడ్‌లో స్క్రోల్ చేయాలో స్వయంగా నియంత్రించుకునే అవకాశం ఇవ్వడం ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా యూజర్లు తమ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడమే కాకుండా.. తమ వీయింగ్ అనుభవాన్ని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోగలరు.

ఈ ఫీచర్ కోసం యూజర్లు ‘Settings’ మెనూలోకి వెళ్లి రోజువారీ షార్ట్‌ల స్క్రోలింగ్ టైమ్ లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత, యూట్యూబ్ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది. ఆ రోజుకి షార్ట్‌ల స్క్రోలింగ్‌ను నిలిపివేయబడిందని సూచించే ఈ ప్రాంప్ట్‌ను యూజర్ అవసరమైతే డిస్మిస్ చేయవచ్చు. యూట్యూబ్ ప్రకారం, ఈ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో బాధ్యతాయుతమైన అలవాట్లను ప్రోత్సహించడమే కాకుండా.. యూజర్లకు సమయాన్ని సక్రమంగా నిర్వహించుకునే సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా తీసుకున్న అడుగు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం!

యూట్యూబ్ ఇప్పటికే Bedtime Reminders, Take a Break ప్రాంప్ట్‌ల వంటి సమయ నియంత్రణ ఫీచర్‌లను అందిస్తోంది. ఇప్పుడు వాటికి తోడు Shorts Time Limit ఫీచర్‌ను కూడా జోడించడం ద్వారా యూజర్లకు మరింత నియంత్రణను ఇస్తోంది. యూట్యూబ్ ఈ ఏడాది చివరిలో పేరెంటల్ కంట్రోల్స్ ను విస్తరించాలని కూడా ప్రకటించింది. ఇందులో Shorts Feed Limit కూడా చేర్చబడనుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు లేదా టీనేజ్ యూజర్లు వాడే supervised accountsలో రోజువారీ స్క్రీన్ టైమ్‌ను నియంత్రించగలరు. అంతేకాకుండా ఈ లిమిట్‌ను పిల్లలు డిస్మిస్ చేయలేని విధంగా సెట్ చేయవచ్చు.

YouTube Shorts Daily Time Limit ఫీచర్ అక్టోబర్ 22 నుండి మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ మరిన్ని యూజర్లకు కూడా రోల్ అవుట్ కానుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూట్యూబ్ యూజర్లలో డిజిటల్ వెల్‌బీయింగ్, సమయ నియంత్రణ వంటి అలవాట్లను పెంపొందించడంలో మరో ముందడుగు వేసినట్టుగా చెప్పవచ్చు.

5G Phones: రూ. 15,000 లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. 6500mAh బ్యాటరీ, అద్భుతమైన కెమెరా..

Exit mobile version