21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..

Xiaomi Watch S5 41mm And Smart Band 11

Xiaomi Watch S5 41mm And Smart Band 11

Xiaomi Watch S5 41mm and Smart Band 11 Launched: షావోమీ గ్లోబల్ మార్కెట్‌లో రెండు కొత్త వేరబుల్స్‌ను లాంచ్ చేసింది. Xiaomi Watch S5 41mm స్మార్ట్‌వాచ్‌తో పాటు Xiaomi Smart Band 11 ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, AMOLED డిస్‌ప్లేలు, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వీటిని తీసుకొచ్చింది. ఈ రెండు డివైజ్‌లు Xiaomi HyperOS 4 ఆధారంగా పనిచేస్తాయి.

Xiaomi Watch S5 41mm ఫీచర్లు

Xiaomi Watch S5 41mm స్మార్ట్‌వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో ప్రీమియం డిజైన్‌లో వచ్చింది. దీని మందం 9.9 మిల్లీమీటర్లు. చేతికి సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన లగ్స్‌ను ఇందులో అందించారు. ఈ వాచ్‌లో 1.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. వన్ గ్లాస్ సొల్యూషన్ టెక్నాలజీతో రూపొందించిన డిస్‌ప్లే కారణంగా ఇందులో 590mAh బ్యాటరీని అమర్చగలిగారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, లైట్ బ్లూ, సిరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్లాక్, లైట్ బ్లూ వేరియంట్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ బెజెల్స్‌తో పాటు ఫ్లోరోరబ్బర్ స్ట్రాప్స్ ఉన్నాయి. సిరామిక్ వైట్ వేరియంట్‌లో సిరామిక్ బెజెల్, జెన్యూన్ లెదర్ స్ట్రాప్‌ను అందించారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది Xiaomi HyperOS 4పై పనిచేస్తుంది. ఇందులో రీడిజైన్ చేసిన కంట్రోల్ సెంటర్, ఫ్లోటింగ్ నోటిఫికేషన్లు, మైనస్ వన్ స్క్రీన్ స్మార్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. NFC ద్వారా గూగుల్ వాలెట్ సపోర్ట్ కూడా అందించారు. యూరప్‌లో వీసా, మాస్టర్ కార్డు భాగస్వామ్యంతో Xiaomi Pay సదుపాయం కూడా లభిస్తుంది.

ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ కోసం 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. వినియోగదారుల వ్యాయామ అలవాట్లకు అనుగుణంగా వర్కౌట్ సూచనలు కూడా లభిస్తాయి. Sleep Algorithm 2.0 ద్వారా నిద్రను ట్రాక్ చేయడంతో పాటు రాత్రిపూట HRV మానిటరింగ్ చేయవచ్చు. Clue భాగస్వామ్యంతో మూడు అంతర్గత సెన్సార్ల డేటా ఆధారంగా మహిళల నెలసరి చక్రానికి సంబంధించిన విశ్లేషణను కూడా అందిస్తుంది.

Xiaomi Smart Band 11 ఫీచర్లు

ఈ కొత్త స్మార్ట్ బ్యాండ్ 11లో 1.72 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. అల్ట్రా థిన్ సిమెట్రికల్ బెజెల్స్‌తో రూపొందించిన ఈ స్క్రీన్ గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా స్టాండర్డ్ వేరియంట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. మిడ్ నైట్ బ్లాక్, గ్లేసియర్ సిల్వర్, మిస్టిక్ రోజ్, మూన్ గోల్డ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. NFC వేరియంట్లలో పెరల్ వైట్ సిరామిక్ ఫినిష్, లావెండర్ పర్పుల్ ఫుల్ మెటల్ యూనిబాడీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం డ్యూయల్ LED, డ్యూయల్ PD PPG సెన్సార్ వ్యవస్థను ఉపయోగించారు. ఇది 98.2% వరకు హార్ట్ రేట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని షావోమీ వెల్లడించింది. 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు నీటిలో ఉన్నప్పుడు కూడా హార్ట్ రేట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

ఈ బ్యాండ్‌లో 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఆరు రకాల శారీరక కార్యకలాపాలను ఆటోమేటిక్‌గా గుర్తించగలదు. బ్యాటరీ విషయానికి వస్తే స్టాండర్డ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 21 రోజుల వరకు పనిచేస్తుంది. NFC వేరియంట్ తక్కువ వినియోగంలో 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. HyperOS 4 ఆధారంగా పనిచేసే ఈ బ్యాండ్‌లో ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే సదుపాయం ఉంది. అనుకూలమైన షియోమీ స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్ లకు ఒకేసారి కనెక్ట్ చేసి రెండు ఫోన్ల నుంచి నోటిఫికేషన్లు పొందవచ్చు. iOS హెల్త్ డేటా సింక్రొనైజేషన్‌కు కూడా సపోర్ట్ ఉంది.

ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi Smart Band 11 ప్రారంభ ధర 59.90 యూరోలు (USD 66 / సుమారు రూ.6,140)కాగా.. Xiaomi Watch S5 41mm ధర 229.90 యూరోలు (USD 252 / సుమారు రూ.23,570)గా నిర్ణయించారు. ఈ రెండు డివైజ్‌లు షావోమీ అధికారిక ఆన్‌లైన్ ఛానెల్స్, అధీకృత రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.