Xiaomi Pad Mini: చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ తన కొత్త కాంపాక్ట్ టాబ్లెట్ Xiaomi Pad Miniని సెప్టెంబర్ 2025 లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో Redmi Pad 2 Pro, Xiaomi 15T, Xiaomi 15T Pro కూడా విడుదలయ్యాయి. షియోమీ Pad Mini 8.8 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity చిప్‌సెట్, 7,500mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. మరి ఈ ప్యాడ్ పూర్తి విశేషాలేంటో చూద్దామా..
India vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియా ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన తెలుగోడు!
షియోమీ Pad Mini HyperOS పై రన్ అవుతూ, కొత్త HyperAI టూల్స్ (AI Writing, AI Speech Recognition, AI Interpreter, AI Art, AI Calculator, Google Gemini, Circle to Search with Google) సపోర్ట్ చేస్తుంది. ఇది 8.8 అంగుళాల 3K (3008×1880 pixels) డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 403ppi పిక్సెల్ డెన్సిటీ, 16:10 ఆస్పెక్ట్ రేషియో, డాల్బీ విజన్, 600 nits పీక్ బ్రైట్నెస్‌ను కలిగి ఉంది. TÜV Rheinland సర్టిఫికేషన్‌తో లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, Circadian ఫ్రెండ్లీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టాబ్లెట్ 3nm MediaTek Dimensity 9400+ చిప్‌సెట్, Immortalis-G925 MC12 GPU ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ అందించబడింది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13MP సింగిల్ కెమెరా (f/2.2 అపర్చర్, 1/3.06-inch సెన్సార్) ఉంది. ఇది 4K@30fps,1080p@30fps వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా (f/2.28 అపర్చర్, 1/4-inch సెన్సార్) అందించబడింది. ఈ షియోమీ Pad Miniలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, Hi-Res ఆడియో, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉన్నాయి. ఇది 7,500mAh బ్యాటరీతో వస్తూ, 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ అందిస్తుంది.
AP Legislative Council: కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ..! శాసన మండలిలో రచ్చ..
అలాగే ఈ టాబ్లెట్ Wi-Fi 7, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ప్యాడ్ 205.13×132.03×6.46mm డైమెన్షన్స్ కలిగి ఉండగా, బరువు కేవలం 326 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇక షియోమీ Pad Mini 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 429 డాలర్స్ (రూ.37,000). అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా లభిస్తుంది. కానీ, దీని ధర ఇంకా ప్రకటించలేదు. టాబ్లెట్ పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Flagship performance now fits in just one hand.
Meet #XiaomiPadMini, your ultra-portable, productivity-ready sidekick. pic.twitter.com/0gp3dcE2aW
— Xiaomi (@Xiaomi) September 15, 2025
