150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!

  • Xiaomi Band 10 Pro ను చైనాలో లాంచ్
  • షియోమీ 17 Max స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదలైన కొత్త స్మార్ట్ బ్యాండ్
  • కేవలం 9.7mm మందంతో స్లిమ్ & ప్రీమియం డిజైన్
  • అందుబాటులోకి గోల్డ్ మిలనీస్, లెథర్, మాగ్నెటిక్ స్ట్రాప్ ఆప్షన్లు..
Xiaomi Band 10 Pro (1)

Xiaomi Band 10 Pro (1)

Xiaomi Band 10 Pro Launch: షియోమీ (Xiaomi) నుండి కొత్తగా స్మార్ట్ బ్యాండ్ Xiaomi Band 10 Pro ను చైనాలో లాంచ్ చేసింది. షియోమీ 17 Max స్మార్ట్‌ఫోన్‌తో పాటు వచ్చిన ఈ బ్యాండ్‌ లో AMOLED డిస్‌ప్లే, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, GPS, 21 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్ కేవలం 9.7mm మందంతో స్లిమ్ డిజైన్‌లో వచ్చింది. ఈ బ్యాండ్‌లో ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ను ఉపయోగించారు.

షియోమీ దీనికి అనేక కొత్త స్ట్రాప్ ఆప్షన్లను కూడా తీసుకొచ్చింది. వాటిలో గోల్డ్ మిలనీస్ స్ట్రాప్, లెథర్ స్ట్రాప్, మాగ్నెటిక్ స్ట్రాప్ వంటి ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ బ్యాండ్‌లో 1.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 336 PPI పిక్సెల్ డెన్సిటీ & 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్, ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. షియోమీ బ్యాండ్ 10 ప్రో లో కొత్త డ్యూయల్-PD హార్ట్‌రేట్ సెన్సార్‌ను ఉపయోగించారు. కంపెనీ ప్రకారం ఇది 98.2% వరకు ఖచ్చితమైన హార్ట్‌రేట్ ట్రాకింగ్ అందిస్తుంది. ఇందులో హార్ట్‌రేట్ మానిటరింగ్, Blood Oxygen (SpO2) ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్లీప్ ఆప్నియా రిస్క్ డిటెక్షన్, విమెన్ హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ బ్యాండ్‌లో 150కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందించారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీలకు ప్రత్యేక ట్రాకింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే అండర్ వాటర్ హార్ట్ రేట్ మానిటరింగ్ & GNSS GPS సపోర్ట్ కూడా ఉంది. Xiaomi HyperOS 3 ఆధారంగా పనిచేసే ఈ బ్యాండ్‌లో స్మార్ట్ నోటిఫికెషన్స్, గేమ్ మోడ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్స్, వాయిస్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 400కి పైగా గేమ్స్‌కు సపోర్ట్ కూడా అందించారు.

ఈ బ్యాండ్ iPhone, Xiaomi ఫోన్లతో ఒకేసారి కనెక్ట్ అవుతుంది. ఆపిల్ హెల్త్ సింక్, కెమెరా కంట్రోల్స్, ఆపిల్ షార్ట్ కట్స్ వంటి iOS ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 350mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఈ బ్యాండ్ మూడు వేరియంట్లలో విడుదలైంది. స్టాండర్డ్ ఎడిషన్ 399 యువాన్ (రూ. 5,625), లెథర్ ఎడిషన్ 449 యువాన్ (రూ. 6,330), సిరామిక్ ఎడిషన్ 479 యువాన్ (రూ. 6,755) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ బ్యాండ్ చైనాలో షియోమీ స్టోర్లు, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.