Site icon NTV Telugu

Redmi: యూజర్స్‌కి బంపరాఫర్.. ఆ సమస్యకి చెక్

Redmi Phones Battery Issue

Redmi Phones Battery Issue

ఇప్పుడున్న ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ (షావోమీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్) ఒకటి. ఎన్నో అధునాతనమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలతో అతి తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంటాయి. అందుకే, మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ రెడ్‌మీ ఫోన్ భారీగా అమ్ముడుపోతుంటాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ ఫోన్ విషయంలో అందరికీ కామన్‌గా ఒక సమస్య ఉంది. అదే.. బ్యాటరీ!

నిజానికి.. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా మంచిదే! ఎంత వాడినా, గంటల తరబడి చార్జింగ్ ఉంటుంది. కానీ, ఆ బ్యాటరీ డెడ్ అయితే? అప్పుడు సంగతేంటి? ఎప్పట్నుంచో ఈ సమస్య వేధిస్తూనే ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సంస్థ దానికి చెక్ పెట్టింది. అవును, తమ యూజర్స్ వినియోగిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్‌ల బ్యాటరీను మార్చి.. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుతున్నట్టు తెలిపింది.

అది కూడా కేవలం 499 రూపాయలకే! బ్యాటరీ డెడ్‌ అయినట్లు అనిపించినా.. లేదా చార్జింగ్ ఎక్కకపోయినా.. దగ్గర్లో ఉంటే సర్వీస్ సెంటర్‌ని ఆశ్రయించొచ్చని.. తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్ చేసింది. మొత్తానికి, ఇన్నేళ్ల తర్వాత రెడ్‌మీ ఓ మంచి పనికి పూనుకుంది.

Exit mobile version