Xiaomi 17 Ultra Launch: షియోమీ (Xiaomi) భారత్ లో షియోమీ 17 సిరీస్ (Xiaomi 17 Series)ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో షియోమీ 17(Xiaomi 17), షియోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra) అనే రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను తీసుకవచ్చారు. వీటిలో ఇమేజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో లైకా (Leica)తో ఉన్న భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌లో ఫోటోగ్రఫీకి సంబంధించిన అధునాతన ఫీచర్లు, కొత్త సెన్సార్ టెక్నాలజీని పొందుపరిచారు.
షియోమీ 17 అల్ట్రాలో ప్రధానంగా 1-అంగుళం LOFIC మెయిన్ కెమెరా సెన్సార్ ను అందించారు. ఇది లైకాతో కలిసి అభివృద్ధి చేసిన సెన్సార్. ఈ టెక్నాలజీ వల్ల ఫోటోలు తీసేటప్పుడు వెలుతురు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న సన్నివేశాల్లో కూడా మంచి డిటైల్ క్యాప్చర్ చేయగలదు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఎక్కువ వెలుతురు, చీకటి ఉన్న ప్రాంతాలను ఒకేసారి సరిగ్గా క్యాప్చర్ చేయడంలో ఇబ్బంది పడతాయి. కానీ LOFIC సెన్సార్ మొత్తం ఫ్రేమ్‌లోని బ్రైట్, డార్క్ ప్రాంతాల్లో కూడా సరైన విలువలతో నిలుపుతుంది.
మెయిన్ కెమెరాతో పాటు ఈ ఫోన్‌లో 200MP Leica టెలిఫోటో కెమెరాను కూడా అందించారు. ఇందులో ప్రత్యేకంగా 75mm నుంచి 100mm వరకు కంటిన్యూయస్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. సాధారణంగా ఫోన్లలో జూమ్ స్థాయిలు ఫిక్స్‌గా ఉంటాయి. కానీ, ఈ ఫోన్‌లో ఫోకల్ లెంగ్త్ ను మార్చుకోవచ్చు. దీని వల్ల పోర్ట్రెయిట్ ఫోటోలు తీయడం, దూరంలోని వస్తువులను క్యాప్చర్ చేయడం లేదా ఫ్రేమింగ్‌ను సులభంగా సర్దుబాటు చేయడం సులభమవుతుంది. ఈ ఆప్టికల్ సిస్టమ్ Leica APO స్టాండర్డ్స్ ప్రకారం రూపొందించబడిందని కంపెనీ తెలిపింది. దీని వల్ల కలర్ ఫ్రింజింగ్ తగ్గి జూమ్ సమయంలో కూడా స్పష్టమైన చిత్రాలు పొందవచ్చు. వీడియో క్రియేటర్ల కోసం Dolby Vision వీడియో రికార్డింగ్, ACES Log వీడియో క్యాప్చర్ సపోర్ట్ ఉంది.
ఈ ఫోన్‌లో OLED డిస్‌ప్లేను అందించారు. ఇందులో పీక్ బ్రైట్‌నెస్ 3,500 నిట్స్ వరకు ఉంటుంది. అలాగే 1Hz నుంచి 120Hz వరకు LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. స్క్రీన్‌పై జరుగుతున్న పనికి అనుగుణంగా రిఫ్రెష్ రేట్ మారుతూ ఉండటం వల్ల స్మూత్ అనుభవంతో పాటు బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. ఇంకా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్, ఫోటోగ్రఫీ ప్రాసెసింగ్ మరియు మల్టీటాస్కింగ్ పనులను సమర్థంగా నిర్వహిస్తుంది.
ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీను అందించారు. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. భారీ బ్యాటరీ, కెమెరా హార్డ్‌వేర్ ఉన్నప్పటికీ ఫోన్ మందం 8.29mm మాత్రమే. అలాగే బరువు 218.4 గ్రాములు ఉండటం విశేషం. భారత్‌లో Xiaomi 17 Ultra ప్రారంభ ధర రూ. 1,29,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ లేదా EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ప్రారంభ కొనుగోలుదారులకు రూ. 19,999 విలువ ఉన్న షియోమీ 17 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ ప్రోను పరిమిత కాలం పాటు ప్రత్యేక ఆఫర్‌గా అందిస్తున్నారు. ఈ ఫోన్ అమెజాన్, షియోమీ అధికారిక వెబ్‌సైట్, షియోమీ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మార్చి 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.
