Site icon NTV Telugu

Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!

Xiaomi 15t

Xiaomi 15t

Xiaomi 15T: షియోమీ 15T సిరీస్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సిరీస్‌లో షియోమీ 15T, షియోమీ 15T ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయని లీకుల విధంగా తెలుస్తోంది. ఈ అధికారిక ప్రకటనకు ముందే, బేస్ మోడల్ షియోమీ 15T స్పెసిఫికేషన్ల వివరాలు బయటపడ్డాయి. ఒక నివేదిక ప్రకారం.. షియోమీ 15T స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 120Hz AMOLED డిస్‌ప్లేను, 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం.

Manchu Lakshmi : అమరావతిలో స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ..

అందిన నివేదిక మేరకు, షియోమీ 15T 6.83 అంగుళాల భారీ AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, I-Care టెక్నాలజీతో కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌లో లైకా బ్రాండెడ్ రేర్ కెమెరా సిస్టమ్, లైకా సమ్మిలక్స్ ఆప్టికల్ లెన్స్‌తో సహా ఉండనుందని తెలుస్తోంది. షియోమీ 15Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ఉండబోతుంది. అలాగే ఈ ఫోన్ HyperOSపై పనిచేస్తుందని అంచనా. అయితే, ఇది గత నెలలో ప్రకటించిన ఆండ్రాయిడ్ 16 ఆధారిత తాజా HyperOS 3తో వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నివేదికల ప్రకారం, షియోమీ 15T ధర EUR 649 (రూ. 65,000) ఉండవచ్చని అంచనా. ఇది 12GB ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో అందించబడుతుందని తెలుస్తోంది. షియోమీ 15T, షియోమీ 15T ప్రో రెండూ ఛార్జింగ్ వేగం మరియు చిప్‌సెట్ మినహా దాదాపుగా ఒకేలాంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయని సమాచారం.

Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?

అలాగే షియోమీ 15Tలో 5,500mAh బ్యాటరీ ఉండనుంది. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో, షియోమీ 25069PTEBG మోడల్ నంబర్‌తో ఒక హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇది షియోమీ 15T అయి ఉంటుందని భావించారు. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ చిప్‌సెట్, 3.25GHz ప్రైమ్ కోర్, మూడు 3GHz పర్ఫార్మెన్స్ కోర్లు, నాలుగు 2.10GHz ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నట్లు ఆ జాబితాలో పేర్కొన్నారు. అలాగే గీక్‌బెంచ్ AI సింగిల్ ప్రెసిషన్ పరీక్షలలో ఇది వరుసగా 1,336 పాయింట్లను సాధించింది. అలాగే క్వాంటైజ్డ్ పరీక్షలో 1,974 పాయింట్లను సాధించింది. షియోమీ 15T ఆండ్రాయిడ్ 15, 12GB ర్యామ్ తో ఉన్నట్లు జాబితాలో చూపబడింది.

Exit mobile version