X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
X Monetization: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్స్ తన మానిటైజేషన్ (ఆదాయం) విధానంలో తాజాగా కీలక మార్పులు చేపట్టింది. క్లిక్‌బైట్ కంటెంట్, స్పామ్ పోస్టులకు అడ్డుకట్ట వేస్తూ.. కేవలం ఒరిజినల్ కంటెంట్‌ను సృష్టించే వారికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేలా కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. ఇకపై ‘X’లో తక్కువ నాణ్యత గల కంటెంట్‌తో డబ్బు సంపాదించడం కష్టం కానుంది. కేవలం వ్యూస్, లైక్‌ల కోసం ఇతరుల వీడియోలను లేదా వైరల్ కంటెంట్‌ను పోస్ట్ చేసే ‘ఎంగేజ్మెంట్ ఫార్మింగ్’పై సంస్థ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్లాట్‌ఫామ్‌పై స్పామ్‌ను తగ్గించి, విలువైన సమాచారాన్ని అందించే క్రియేటర్లను ప్రోత్సహించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం అని సమాచారం.
READ ALSO: Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
కొత్త అప్డేట్ ప్రకారం.. ఎవరైతే స్వయంగా ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తారో, వారికే ఆదాయంలో సింహభాగం దక్కనుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత నుంచి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, వారికి నేరుగా రివార్డులు అందించేలా కొత్త టూల్స్‌ను సంస్థ సిద్ధం చేస్తోంది. గతంలో పోస్టుల కింద వచ్చే రిప్లై వ్యూస్‌కు కూడా ఆదాయం లభించేది. కానీ ఇకపై రిప్లైల ద్వారా వచ్చే వ్యూస్‌ను మానిటైజేషన్ పరిధి నుంచి తొలగించారు. దీనివల్ల అనవసరమైన కామెంట్ల గొడవ తగ్గుతుందని ఎక్స్ భావిస్తోంది.
డబ్బు సంపాదించాలంటే ..
X ప్లాట్ఫామ్లో మానిటైజేషన్ పొందాలనుకునే క్రియేటర్లు ఇకపై ఈ అర్హతలు కలిగి ఉండాలి. కచ్చితంగా X ప్రీమియం లేదా ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. గత మూడు నెలల కాలంలో కనీసం 5 మిలియన్ల ఆర్గానిక్ ఇంప్రెషన్లు సాధించి ఉండాలి. హోమ్ టైమ్‌లైన్‌లోని ఆర్గానిక్ వ్యూస్‌కు, వెరిఫైడ్ యూజర్ల నుంచి వచ్చే వ్యూస్‌కు ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. స్థానిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యూస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదనను ఎలాన్ మస్క్ ప్రస్తుతానికి పక్కన పెట్టారని సమాచారం. ఈ కొత్త మార్పుల వల్ల కేవలం కాపీ-పేస్ట్ చేసే వారికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కష్టపడి కొత్త విషయాలను పంచుకునే నిజమైన క్రియేటర్లకు మాత్రం ‘X’ కాసుల వర్షం కురిపించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..