Wobble K, X Series Smart TVs: భారత్‌లో 2024లో అడుగు పెట్టిన Wobble బ్రాండ్ ఇప్పుడు తన స్మార్ట్ టీవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. Indkal Technologies నిర్వహిస్తున్న ఈ స్వదేశీ బ్రాండ్, ఇప్పటికే ఉన్న X-సిరీస్ కి కొత్త మోడల్‌ను జోడించడంతో పాటు బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న కొత్త K-సిరీస్ టీవీలను కూడా ప్రకటించింది. ఈ టీవీలు వివిధ స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులో ఉండగా.. K-సిరీస్ గరిష్టంగా 65 ఇంచుల వరకు లభిస్తుంది. HDMI 2.1, డ్యువల్-బ్యాండ్ Wi-Fi వంటి ఆధునిక ఫీచర్లతో కేవలం రూ.10,999 ప్రారంభ ధరలోనే మార్కెట్‌లోకి రావడం గమనార్హం.
Read Also: Sanju Samson: న్యూజిలాండ్ సిరీస్‌లో చెత్త ప్రదర్శన.. సంజు శాంసన్ రియాక్షన్ ఇదే!
గేమర్లు & ప్రీమియం యూజర్ల కోసం..
Wobble X-సిరీస్ టీవీ ప్రారంభ ధర రూ.23,999 (43 ఇంచుల మోడల్). ఇవి 50 ఇంచులు, 55 ఇంచుల సైజ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్య ఫీచర్లు:
* Ultra QLED డిస్‌ప్లే
* 1.07 బిలియన్ కలర్స్
* Dolby Vision, MEMC, ALLM సపోర్ట్
* 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) – గేమింగ్‌కు ప్రత్యేక ఆకర్షణ
* HDMI 2.1, eARC సపోర్ట్
* డ్యువల్-బ్యాండ్ Wi-Fi
ఆడియో హైలైట్:
* ఈ సిరీస్‌లో ఉన్న 80W ‘PRO’ స్పీకర్ సెటప్ ఈ ధరల సెగ్మెంట్‌లో అరుదైనది.
* డ్యువల్ వూఫర్లు, ప్రత్యేక యాంప్లిఫైయర్, ట్వీటర్లు, అలాగే Dolby Atmos సపోర్ట్‌తో శక్తివంతమైన ఆడియో అనుభూతిని అందిస్తుంది.
Read Also: Dhurandhar : రణవీర్ సింగ్ రూత్ లెస్ యాక్షన్ ‘ ధురంధర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బడ్జెట్‌లో ప్రీమియం టచ్:
* K-సిరీస్ టీవీలు హై-ఎండ్ స్పెక్స్ లేకపోయినా, రోజువారీ వినియోగానికి అవసరమైన అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ముఖ్య ఫీచర్లు:
* Google TV 5.0
* 32GB స్టోరేజ్
* ALLM & MEMC
* 40W సౌండ్ అవుట్‌పుట్
* Dolby Vision & Dolby Atmos
* స్లిమ్ ఫ్రేమ్‌లెస్ డిజైన్
* వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినోదానికి ఈ టీవీలు మంచి ఎంపికగా నిలవనున్నాయి.
డిజైన్:
* Wobble X-సిరీస్‌లో ఉన్న DynamIQ డ్యువల్ ప్రాసెసర్ (AI ఆధారితం) చిత్రం క్వాలిటీని మెరుగుపరచడంతో పాటు మొత్తం పని తీరును పెంచుతుంది. మెటల్ ఫినిష్, స్లిమ్ ఫ్రేమ్‌లెస్ డిజైన్ టీవీలకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
కంపెనీ వ్యాఖ్యలు:
* “X అండ్ K సిరీస్‌ల పనితీరు కోరుకునే వినియోగదారులు అలాగే సాధారణ భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా స్మార్ట్ టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించాం అని Indkal Technologies, సీఈవో ఆనంద్ దూబే పేర్కొన్నారు.
కొనుగోలు వివరాలు:
* Wobble K-సిరీస్, X-సిరీస్ స్మార్ట్ టీవీలు ప్రస్తుతం Flipkart ద్వారా భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, Wobble కొత్త టీవీలు తమ సెగ్మెంట్‌లలో మంచి పోటీ ఇవ్వగల సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. ఈ టీవీలు ఇప్పటికే వినియోగదారుల ఆసక్తిని రేపుతున్నాయి.