నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో వైఫై ఉండటం సర్వసాధారణం. ఆఫీస్ పని నుండి ఆన్‌లైన్ క్లాసుల వరకు అన్నీ ఇంటర్నెట్‌తోనే ముడిపడి ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు మంచి ప్లాన్ ఉన్నప్పటికీ వైఫై స్లోగా మారుతుంది, వీడియోలు బఫర్ అవుతాయి. దీనికి ప్రధాన కారణం మీ ప్రమేయం లేకుండానే ఇతరులు మీ వైఫైకి కనెక్ట్ అవ్వడం. ఇది కేవలం స్పీడ్‌ను తగ్గించడమే కాకుండా, మీ వ్యక్తిగత డేటా భద్రతకు కూడా ముప్పే.
Uttam Kumar Reddy : వరద జలాల పేరుతో వాడడానికి వీలులేదు
అపరిచితులు మీ వైఫై వాడుతున్నారని ఎలా తెలుసుకోవాలి?
మీ వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారో తెలుసుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించండి:
- డివైజ్ లిస్ట్‌ను సరిచూడండి: ముందుగా మీ ఇంట్లో ఉన్న మొబైల్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీల MAC అడ్రస్ లేదా IP అడ్రస్‌లను ఒక దగ్గర నోట్ చేసుకోండి.
- రౌటర్ సెట్టింగ్స్‌లోకి లాగిన్ అవ్వండి: మీ బ్రౌజర్‌లో రౌటర్ IP అడ్రస్ (సాధారణంగా 192.168.1.1 లేదా రౌటర్ వెనుక ఉంటుంది) టైప్ చేసి, అడ్మిన్ ప్యానెల్‌లోకి లాగిన్ అవ్వండి.
- కనెక్టెడ్ డివైజెస్: సెట్టింగ్స్‌లో ‘Device List’ లేదా ‘DHCP Client List’ అనే ఆప్షన్ వెతకండి. అక్కడ ప్రస్తుతం మీ వైఫైకి కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైజెస్ జాబితా కనిపిస్తుంది.
- అపరిచితులను గుర్తించండి: ఆ జాబితాలో మీ ఇంట్లో లేని కొత్త డివైజ్ ఏదైనా కనిపిస్తే, ఎవరో అపరిచితులు మీ వైఫై వాడుతున్నారని అర్థం.
పరిష్కారం ఏమిటి?
ఒకవేళ మీ వైఫై ఇతరులు వాడుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- పాస్‌వర్డ్ మార్చండి: వెంటనే మీ వైఫై పాస్‌వర్డ్‌ను మార్చండి. పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్లు , స్పెషల్ క్యారెక్టర్లు (@, #, $ వంటివి) కలిపి స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోండి.
- WPA3 సెక్యూరిటీ: మీ రౌటర్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ మోడ్‌ను WPA2 లేదా WPA3 కి అప్‌డేట్ చేయండి. ఇది హ్యాకర్ల నుండి రక్షణ ఇస్తుంది.
- SSID హైడ్ చేయడం: మీ వైఫై పేరు ఇతరులకు కనిపించకుండా ‘Hide SSID’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల మీరు మాన్యువల్‌గా పేరు టైప్ చేస్తేనే వైఫై కనెక్ట్ అవుతుంది.
- మీ వైఫై భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా స్పీడ్‌తో పాటు మీ డేటాను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
