Site icon NTV Telugu

Wi-Fi Users Alert: వైఫై యూజర్స్‌కి అలర్ట్.. వీటి గురించి తెలుసా..!

01

01

Wi-Fi Users Alert: మీ ఇంట్లో వైఫై ఉందా అయితే ఈ స్టోరీ మీ కోసమే. అసలు రాత్రి నిద్రపోయే సమయంలో Wi-Fi ఆన్ చేసి నిద్రపోతే కరెంట్ ఛార్జ్ పెరుగుతుందో లేదో ఎప్పుడన్నా ఆలోచించారా. చాలా మంది యూజర్స్‌కి ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. Wi-Fi రూటర్‌ను 24/7 ఆన్‌లో ఉంచాలా వద్దా ప్రశ్నకు ఆన్సరే ఈ స్టోరీ నిలుస్తుంది. మీరు ఆలస్యంగా మేల్కొని గంటల తరబడి ఫోన్, లాప్‌ట్యాప్ స్క్రోల్ చేసే అలవాటు కలిగి ఉంటే, మీరు రాత్రంతా మీ Wi-Fi సిగ్నల్‌ను ఆన్‌లో ఉంచే అవకాశం ఉంది. వాస్తవానికి Wi-Fi రూటర్‌ను 24/7 ఆన్‌లో ఉంచడం ఉత్తమ మార్గం. ఇది యూజర్స్‌కి మంచి నాణ్యమైన సేవలను అందించడమే కాకుండా, మీ పరికరాలను సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. రాత్రిపూట Wi-Fi రూటర్లను ఆఫ్ చేయడం వల్ల కొంత విద్యుత్తు సేఫ్ అవుతుంది కానీ.. ఇది చాలా తక్కువ. రూటర్ ఆన్‌లో ఉన్నా మీ విద్యుత్ బిల్లులో మీకు పెద్దగా తేడా కనిపించదు. నిజానికి రూటర్లు 24/7 పనిచేసేలా రూపొందించబడ్డాయి. వాటిని తరచుగా ఆన్/ఆఫ్ చేయడం వల్ల వాటి లైఫ్‌టైం తగ్గుతుంది.

READ MORE: Alapati Rajendra Prasad: శాతవాహన కళాశాల వివాదంలో ట్విస్ట్‌.. ఆలపాటి కీలక వ్యాఖ్యలు..

రాత్రి సమయంలో Wi-Fi ని ఆపివేయాలా?
తరచుగా రాత్రి సమయంలో Wi-Fi ని ఆపివేయాలనే దానిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) నిషేధిస్తారని ఎంత మంది యూజర్స్‌కి తెలుసు. ఎందుకు నిషేధిస్తున్నారంటే రూటర్లు సాధారణంగా రాత్రిపూట ముఖ్యమైన ఫర్మ్‌వేర్ అప్డేడ్స్ అందుకుంటాయి. ఇవి వాటి భద్రత, పనితీరును పెంచుతుంది. రూటర్‌ను క్రమం తప్పకుండా ఆన్, ఆఫ్ చేస్తుంటే ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, నెట్‌వర్క్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మీ రౌటర్‌ను ఆఫ్ చేయడం కారణంగా వాటితో కనెక్ట్ అయిన స్మార్ట్ థర్మోస్టాట్ షెడ్యూల్‌, డోర్‌బెల్, కెమెరాలు పనికిరాకుండా పోతాయి. అందుకని పగలు, రాత్రి ఎప్పుడైనా సరే మీ Wi-Fi రౌటర్‌ను మాత్రం ఆఫ్ చేయకపోవడం చాలా ఉత్తమం.

READ MORE: No Trump Effect: నో ట్రంప్ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్..!

Exit mobile version