Site icon NTV Telugu

Phone battery: చలికాలంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఎందుకు.?

Phone Battery

Phone Battery

Phone battery: చలికాలం వణుకు పుట్టిస్తోంది. డిసెంబన్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి పీక్స్‌కు చేరుకుంటుంది. అయితే, సాధారణంగా చలికాలంలో మన మొబైల్ ఫోన్‌లోని బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం గమనిస్తుంటాం. అప్పటి వరకు 100 శాతం ఉన్న బ్యాటరీ సాధారణం కన్నా వేగంగా పడిపోతుంటుంది. అయితే, దీని వెనక ఫిజిక్స్ ఉంది. మన సెల్‌ఫోన్లలో ‘‘లిథియం అయాన్’’ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాం. ఇది తక్కువ సైజ్‌లో ఎక్కువ శక్తిని స్టోర్ చేస్తుంది. అయితే, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బ్యాటరీలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.

లిథియం అయాన్లు కాథోడ్ నుంచి ఆనోడ్‌కి, ఆనోడ్ నుంచి కాథోడ్‌కి కదులుతుంటాయి. ఈ అయాన్లు ద్రవ ఎలక్ట్రోలైట్ ద్వారా కదులుతాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఎలక్ట్రోలైట్ చిక్కగా మారుతుంది, దీంతో నిరోధకత పెరుగుతుంది. అయాన్ కదలికలు నెమ్మది అవుతాయి. దీంతో పవర్ సప్లై చేయడానికి బ్యాటరీ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఛార్జ్ వేగంగా అయిపోతుంది. సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో 70 శాతం వేగంగా ఛార్జింగ్ తగ్గుతుందని ఒక పరిశోధన తెలుపుతోంది.

RAED ALSO: Smriti Mandhana: ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..

ఐఫోన్ ఆపరేటింగ్ పరిధి 0-35 డిగ్రీ సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మొబైల్ ఫోన్లు ఎక్కువగా ప్రొటెక్టివ్ షట్ డౌన్‌లు అవుతాయని చెప్పింది. ఉష్ణోగ్రతలు తగ్గడం విద్యుత్ వినియోగాన్ని తీవ్రంగా పెంచుతుందని, ఛార్జింగ్ చాలా వేగంగా తగ్గుతుందని, ఫోన్‌ను వెచ్చగా ఉన్న ప్రాంతాల్లో ఉంచాలని ప్రముఖ కంపెనీ శామ్సంగ్ సలహా ఇస్తోంది. ఉత్తర భారతదేశం సాధారణంగా శీతాకాలంలో 5-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఈ ఉష్ణోగ్రతలు బ్యాటరీలను వేగంగా డిశ్చార్జ్ చేయడానికి కారణమవుతాయి. వేగంగా మారే ఉష్ణోగ్రతలు ఫోన్ లో ‘‘కండేన్సేషన్’’ అనే ప్రక్రియకు దారి తీస్తుంది. ఇది సర్క్యూట్రీపై ఒత్తిడిని పెంచుతుంది.

500 కంటే ఎక్కువ ఛార్జ్ సైకిల్స్ పూర్తి చేసిన బ్యాటరీలకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఫోన్ చల్లగా ఉన్నప్పుడు ఛార్జ్ చేయడం ప్రమాదం, సాధారణ ఇంటర్‌కలేషన్ ప్రక్రియ విఫలం అవుతుంది. ఇంటర్‌కలేషన్ అనేది రివర్సబుల్ ప్రక్రియ. దీని ద్వారా లిథియం అయాన్లు ఎలక్ట్రోడ్‌ల క్రిస్టల్ నిర్మాణంలోని ఖాళీల్లోకి చొచ్చుకుపోతాయి. కానీ చలికాలంలో అయాన్లు లోపలికి వెళ్లక అనోడ్‌పై మెటాలిక్ లిథియం పేరుకుపోయేలా చేస్తుంది. దీనిని ‘‘లిథియం ప్లాటింగ్’’ అంటారు. ఇది బ్యాటరీని పూర్తిగా నాశనం చేస్తుంది. పేలుడు ప్రమాదాన్ని, వేడిని పెంచుతుంది. చలి కాలంలో ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ రూం టెంపరేచర్‌కు వచ్చే వరకు ఉండాలి. 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఛార్జింగ్ చేయవద్దు.

Exit mobile version