NTV Telugu Site icon

Smartphone Overheat : వేసవిలో మీ స్మార్ట్ ఫోన్లు ఎందుకు వేడెక్కుతాయో తెలుసా ?

Mobile Heat

Mobile Heat

సమ్మర్ లో మనుషులకు మాత్రమే ఎలెక్ట్రానిక్ వస్తువులకు వేడి పెరుగుతుంది.. ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే స్మార్ట్ ఫోన్లు.. బయట వేడి, శరీరం వేడి రెండు కలిసి ఫోన్ ను వేడెక్కేలా చేస్తాయి.. అప్పుడు అలానే వాడితే ఫోన్ పాడవచ్చు.. కొన్ని సార్లు బ్యాటరీ లీకేజీ జరిగే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేసవిలో ఫోన్‌ వేడెక్కకుండా కాపాడుకోవచ్చు.. ఆ టిప్స్ ఏంటో చూద్దాం..

సమ్మర్ లో ఫోన్ వేడెక్కుతుంది.. శరీర ఉష్ణోగ్రత, బయట ఉష్ణోగ్రత కారణంగా ఫోన్‌ వేడెక్కే అవకాశం ఉంది. అందువల్ల స్మార్ట్‌ ఫోన్ శరీరానికి అంటిపెట్టుకోకుండా దూరంగా ఉండేలా చూడాలి.. ఫోన్ను ఎప్పుడూ వాడకుండా కాస్త బ్రేక్ తీసుకోవడం మంచిది.. ఫోన్ స్క్రీన్ కు రెస్ట్ దొరుకుతుంది..

వేసవి కాలం మాత్రమే కాదు మామూలు సమయంలోనూ సూర్యకాంతి నేరుగా స్మార్ట్‌ ఫోన్‌ పైన ప్రసారం కాకుండా చూడాల్సి ఉంటుంది. దీని వల్ల స్మార్ట్‌ ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది.. అందుకే కాస్త నీడ ఉన్న ప్రాంతంలో ఫోన్ ఉంచడం మంచిది..

యాప్స్ ను ఎక్కువగా వాడటం తగ్గించాలి.. వేడెక్కుతుంది అని వార్నింగ్ వస్తే వెంటనే అవన్నీ ఆపేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడం లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడం చెయ్యాలి..

ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రీజర్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేయకూడదు. తక్కువ సమయంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది..

బయటకు వెళ్ళినప్పుడు అదికూడా సమ్మర్ లో కారులో ఫోన్ పెట్టి వెళ్లకండి వేడెక్కుతుంది.. ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉంది.. సమ్మర్ లో వీలైనంత తక్కువగా ఫోన్ ను వాడటం మంచిది..