NTV Telugu Site icon

Whatsapp Updates: అదిరిపోయే కాలింగ్ ఫీచర్స్ తో అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్..

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకోవచ్చింది. ఇదివరకు అనేక కాలింగ్ అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్ మరోసారి ఏకంగా మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2015లో వాట్సాప్ కాలింగ్ ను మొదలు పెట్టినప్పుడు నుంచి అనేక అప్డేట్స్ తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్ఫామ్ లలో సపోర్ట్ తో అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే తాజాగా తీసుకువచ్చిన మూడు అప్డేట్ల విషయానికి వస్తే..

32 మందితో వీడియో కాల్స్:

వీడియో కాల్ విషయంలో వాట్సాప్ గణనీయమైన అప్ గ్రేడ్ తీసుకువచ్చింది. వీడియో కాల్ లో పాల్గొనే వారి సంఖ్య తాజాగా 32 కి చేరుకుంది. దీంతో ఇప్పుడు ఫోన్ లేదా డెస్క్టాప్ ఇలా సంబంధం లేకుండా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ ఇంట్రాక్ట్ అవచ్చు. ఇది ఎక్కువగా స్నేహితులను పలకరించినప్పుడు, అలాగే వర్చువల్ మీటింగ్స్ సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఆడియోతో స్క్రీన్ షేరింగ్:

వాట్సప్ కాలింగ్ సమయంలో ఆడియోతో పాటు స్క్రీన్ షేరింగ్ అనేది సరికొత్త ఫీచర్లలో ఒకటి. మీరు ఆడియోతో పాటు వీడియోను చూడాలన్న సమయంలో లేదా కాల్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్ పై ఏదైనా షేరింగ్ చేయాలనుకుంటే సరైన ఆప్షన్ గా ఇప్పుడు వినియోగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆడియోను స్క్రీన్ చేసిన సమయంలో వినవచ్చు. దీంతో గ్రూప్ కాల్స్ మరింత ఇంటర్ యాక్టివ్ గా ఉండబోతున్నాయి.

స్పీకర్ స్పాట్లైట్:

ఇకపోతే ఈ అప్డేట్ లో మనం గ్రూపు కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎవరు మాట్లాడుతున్న విషయం ట్రాక్ చేయవచ్చు. అయితే కొత్త స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ తో మాట్లాడుతున్న వ్యక్తి ఆటోమేటిక్గా స్క్రీన్ పై హైలైట్ అవుతుంది. మాట్లాడుతున్న వారు స్క్రీన్ పై మొదట కనిపిస్తారు. దాంతో కాన్వర్జేషన్ మరింత సులభంగా జరగనుంది.

Show comments