NTV Telugu Site icon

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. జూమ్‌, గూగుల్‌ మీట్‌లా…!

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే వాట్సాప్‌లో వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌ అందుబాటులో ఉన్నాయి.. అయితే, వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.. వీడియో కాల్‌ ఒకేసారి.. ఎక్కువ మందితో మాట్లాడడం కుదరదు.. అయితే, ఆ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు రెడీ అయ్యింది ఈ సోషల్‌ మీడియా మేసేజింగ్‌ యాప్‌.. జూమ్‌, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ లాంటి వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌ తరహాలో ఈ కొత్త ఫీచర్‌ను తన యూజర్లకు అందించనుంది… అయితే, జూమ్‌, గూగుట్‌ మీట్‌లా… వాట్సాప్‌లో కూడా ఓ లింక్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని వాట్సాప్‌ పేరెంట్ కంపెనీ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.. త్వరలోనే వాట్సాప్‌ కాల్ లింక్స్ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.. క్రమంగా యూజర్లకు యాడ్ అవుతుందని పేర్కొన్నారు..

Read Also: Supreme Court: సుప్రీంలో చరిత్రాత్మక ఘట్టం.. విచారణలు ప్రత్యక్షప్రసారం

అసలు ఈ కాల్ లింక్స్ ఫీచర్.. ఎలా క్రియేట్‌ చేయాలి..? ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల్లోకి వెళ్తే.. వీడియో, ఆడియో కాల్స్ కోసం లింక్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఇస్తుంది వాట్సాప్‌.. మీటింగ్ కోసం ఓ లింక్ క్రియేట్ చేసి.. మీ మీటింగ్‌లో జాయిన్‌ కావాల్సిన వారికి.. సంబంధిత లింక్‌ షేర్ చేయాల్సి ఉంటుంది.. ఇక, వారు ఆ లింక్ ద్వారా ఆ మీటింగ్‌లో జాయిన్ కావొచ్చు. ఇప్పటికే గూగుల్ మీట్, జూమ్‌తో పాటు మరికొన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు.. వాట్సాప్‌కు కూడా అందులో యాడ్ కాబోతుందన్నమాట.. ఇప్పటి వరకు మాన్యువల్‌గా యూజర్లను జాయిన్ చేసుకునే అవకాశం ఉంది.. అది కూడా పరిమిత సంఖ్యలోనే.. కానీ, త్వరలోనే అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌తో.. ముందుగానే లింక్ పంపి అందరూ సులువుగా కాల్‌, వీడియో మీటింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది.. ఈ కాల్ లింక్స్ ద్వారా 32 మంది వరకు ఆడియో, వీడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చు అని వాట్సాప్‌ వర్గాలు చెబుతున్నాయి..

ఈ వారం చివరి నాటికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెడతామని కంపెనీ పేర్కొంది.. దీని కోసం, వినియోగదారులు యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని.. మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. జుకర్‌ యొక్క ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం, వాట్సాప్ కాల్ లింక్‌లు చాలా ముఖ్యమైన ఫీచర్‌గా ఉండబోతున్నాయి. ఇప్పటికే ప్రోగ్రెస్‌లో ఉన్న కాల్‌ని కనెక్ట్ చేయడానికి వినియోగదారులు లింక్‌ని సృష్టించి, దాన్ని వారి స్నేహితులకు పంపవచ్చు అని తెలిపారు.. వినియోగదారులు గూగుల్‌ మీట్‌లో వలె లింక్‌పై క్లిక్ చేసి, ఆ లింక్ ద్వారా ఒక ట్యాప్‌తో కాల్‌లో చేరవచ్చు. కాల్ లింక్‌ని సృష్టించడానికి, వినియోగదారులు కాల్ ట్యాబ్ కింద కాల్ లింక్‌ని సృష్టించవచ్చు. ఆప్షన్‌పై నొక్కడం ద్వారా మరియు ఆడియో లేదా వీడియో కాల్ కోసం లింక్‌ని సృష్టించడం.. మరియు దానిని కుటుంబం, స్నేహితులతో భాగస్వామ్యం చేయడం ద్వారా వినియోగించుకోవచ్చని వెల్లడించారు.