NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..ప్రొఫైల్ ను సేఫ్టీగా ఉంచుతుంది..

Whatsapp New

Whatsapp New

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాట్సాప్‌ అందుకు అనుగుణంగా ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ ఫీచర్ తో మనం ప్రొఫైల్ మరింత సేఫ్టీగా ఉంటుంది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీ ప్రొఫెల్‌ ఫొటోలు, స్టేటస్‌లు విషయంలో పలు ప్రైవసీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అన్‌నోన్‌ నెంబర్స్‌, మీ కాంటాక్ట్‌లో సేవ్‌లేని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ రింగ్‌ కాకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా, తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

మీ ఫోన్ ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ ప్రొటెక్షన్‌,ఆడియో కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసినా లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వంటి వివరాలు అవతలి వ్యక్తులకు తెలియకుండా చేసుకోవచ్చు.. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే.. ముందుగా వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపు త్రీ డాట్స్‌ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. అనంతరం అక్కడ ఉన్న అడ్వాన్స్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు ఎక్కడుండి ఫోన్‌ మాట్లాడుతున్నారన్న విషయాన్ని అవతలి వ్యక్తి తెలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల కాల్ క్వాలిటీ కొంత తగ్గుతుందని చెబుతున్నారు.. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌ తో పాటు ఐఓస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. మరెందుకు ఆలస్యం మీకు కూడా ఈ కొత్త ఫీచర్‌ వచ్చేందేమో చెక్‌ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి… రాకుంటే వాట్సాప్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. అప్పుడే ఈ ఫీచర్ ను మీరు ఉపయోగించుకోవచ్చు..