Site icon NTV Telugu

VW Smart QLED Android TV: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. రూ.10,999కే 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. !

Vw

Vw

VW Smart QLED Android TV: ఇంట్లో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువుగా ఉందా.? అయితే ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. VW సంస్థ అందిస్తున్న 40 అంగుళాల స్మార్ట్ QLED ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధరపై కంపెనీ 48% బంపర్ ఆఫర్‌ను అందిస్తూ ఈ టీవీని కేవలం రూ.10,999కే విక్రయిస్తోంది. ఈ టీవీపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో అద్భుతమైన అనుభవాన్ని అందించే ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది.

Phone Chargers: ఇలాంటి మొబైల్ ఛార్జర్లు కొనొద్దు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం..!

అలాగే ఈ టీవీ 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్, స్టీరియో సరౌండ్ సౌండ్‌తో 5 సౌండ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ టీవీ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 2 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, Wi-Fi, LAN సదుపాయాలు ఉన్నాయి. దీంతో సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా హార్డ్ డ్రైవ్‌లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..

ఈ టీవీ G5, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇరోస్ నౌ, యూట్యూబ్ వంటి ప్రముఖ యాప్‌లకు సపోర్ట్ అందిస్తుంది. అంతేకాకుండా మిరాకాస్ట్ ఫీచర్ ద్వారా మొబైల్ స్క్రీన్‌ను టీవీలో ప్రదర్శించే సౌకర్యం కూడా ఉంది. సాధారణంగా రూ. 15,000 లోపు బడ్జెట్‌లో 32 అంగుళాల టీవీలే లభిస్తుంటాయి. కానీ, ఇంత తక్కువ ధరకే 40 అంగుళాల టీవీ అందుబాటులో ఉండటం వినియోగదారులకు నిజంగా మంచి అవకాశం.

Exit mobile version